ఆదాయ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష.. 2026-27కి రూ. 1.27 లక్షల కోట్ల టార్గెట్
- ఆదాయార్జన శాఖలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
- 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ. 1.27 లక్షల కోట్ల ఆదాయం లక్ష్యం
- గత ఏడాదితో పోలిస్తే 6 శాతం పెరిగిన రాష్ట్ర సొంత ఆదాయం
- లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని అధికారులకు సీఎం ఆదేశం
- ప్రభుత్వ సొమ్ము సద్వినియోగం కావాలని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే కీలక శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 1,27,506 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా నిర్దేశిస్తూ, ఆ దిశగా పనిచేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో శాఖల వారీగా ప్రభుత్వానికి సమకూరుతున్న ఆదాయంపై అధికారులు ముఖ్యమంత్రికి వివరాలు అందించారు. రాష్ట్ర సొంత ఆదాయం (స్టేట్ ఓన్ రెవెన్యూస్) 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ. 1,04,345 కోట్లుగా ఉండగా, 2025-26 నాటికి అది రూ. 1,10,643 కోట్లకు చేరినట్లు తెలిపారు. తద్వారా గత ఏడాదితో పోలిస్తే 6 శాతం వృద్ధి నమోదైనట్లు వివరించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ ద్వారా రూ. 33,679 కోట్లు, గనుల శాఖ నుంచి రూ. 10,300 కోట్లు, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల ద్వారా రూ. 11,047 కోట్ల ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో, నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా గనులు, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, రవాణా, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖలు పనిచేయాలని చంద్రబాబు ఆదేశించారు. ప్రభుత్వ ఆదాయంలో ప్రతీ రూపాయి ప్రజలకు సద్వినియోగం కావాలని, ఆ దిశగా అధికారులు బాధ్యతతో వ్యవహరించాలని ఆయన స్పష్టం చేశారు.
ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌తో పాటు ఆర్ధిక, రవాణా, ఎక్సైజ్, గనులు, స్టాంపులు-రిజిస్ట్రేషన్, వాణిజ్య పన్నులు, అటవీ, పురపాలక శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.